Elections |  కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే అభివృద్ధి

Written by telangana jyothi

Published on:

Elections | కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే అభివృద్ధి

బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి

తెలంగాణ జ్యోతి, నవంబర్ 11, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు ఛత్తీస్గడ్లో వేలకోట్ల కాంట్రాక్టుల ద్వారా వచ్చిన సొమ్ముతో ములుగు నియోజకవర్గంలో డబ్బు మద్యం పంచుతూ యువతను కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శనివారం తాడ్వాయి మండలంలోని రంగాపూర్, వీరాపూర్, బీరెల్లి, ఆశన్నగూడెం, ఎల్లాపూర్,కామారం, అంకంపల్లి,నర్సాపూర్,పంబపూర్, దామెరవాయి, భూపతిపూర్, కాటాపూర్, గంగారం, తాడ్వాయి, కామారం, కొండపర్తి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ప్రజలను బెదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వొద్దని, 24 గంటల కరెంటు అవసరం లేదని రైతులను చులకనగా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ని నిలదీయాలని ప్రజలను కోరారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లాకు చేసిందేమీలేదని, విప్లవ భావజాలంతో బుల్లెట్ ద్వారా రాజ్యాధికారం సాధించాలనుకున్న మా నాన్న బడే ప్రభాకర్ రావు ఆనాడు భూములు పోడు చేయించి పంపకాలు చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ వాటికి పట్టాలు ఇచ్చి రైతు బంధు ఇస్తున్నట్లు తెలిపారు. ఆనాడు మానాన్న బుల్లెట్ ద్వారా రాజ్యాధికారం కావాలనుకున్నార ని, తాను బ్యాలెట్ ద్వారా విజయం సాధించి ప్రజలకు సేవ చేయాలనుకుంటు న్నట్లు తెలిపారు. తన చివరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రజల కోసమే పని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 10 సంవత్సారాల క్రితం తెలంగాణ ఎట్లుందో.. ఇప్పుడు మన ములుగు ఎట్లా ఉందొ ప్రజలు విశ్లేషణ చేసుకోవాలన్నారు. బీ ఆర్ ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రత్యర్థుల గుండెల్లో ఓటమి భయం పుట్టుకుందని, దంతో బీ ఆర్ ఎస్ గెలుపు ఖరారు అయినట్లు తెలిపారు. ములుగు ఏరియాలో గుడిసెలన్ని పక్క ఇల్లులుగా మార్చాకే నేను ఇల్లు కట్టుకుంటా అన్నారు.కెసిఆర్ మూడో సారి ముఖ్య మంత్రి కాగానే మ్యానిఫెస్టోలో పొందుపర్చిన విధంగా మహిళలకు 3000ల జీవన భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు మనల్ని పట్టించుకున్న పాపన పోలేదు. ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లిన కెసిఆర్ ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులకు పోడు భూములకు యాజమాన్య హక్కుల కల్పనకు, అసైన్డ్ భూములను హక్కులు కల్పిస్థామాని మేనిఫెస్టోలో పెట్టింది కేవలం టిఆర్ఎస్ పార్టీయే అన్నారు. రైతుబంధు 16 వేల రూపాయలు, పెన్షన్స్ 5016 పెంచడం తో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. ములుగు నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దండుగుల మల్లయ్య, గ్రామాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now