14న ఎరుకల సంఘం ములుగు జిల్లా కమిటీ ఎన్నిక
-తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు
ములుగు,తెలంగాణజ్యోతి : ఈనెల 14న తెలంగాణ ఆదివాసి ఎరుకలసంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా కమిటీ ఎన్నిక జరగనున్నట్లు తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆదివారం తెలిపారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఎన్నిక జరుగుతుందని గ్రామ , మండల, జిల్లా ఎరకల కులస్తులు ప్రతి ఒక్కరు హాజరై ఎన్నికకు సహకరించాలని వారు కోరారు.