గోవిందరావుపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

గోవిందరావుపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

ములుగు/గోవిందరావు పేట : గోవిందరావుపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సీనియర్ పాత్రికేయులు ఆకుల యుగేందర్, నెక్కంటి సునీల్ కుమార్ ల ఆధ్వర్యంలో జరిగిన మండల ప్రెస్ క్లబ్ సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షునిగా మోడెం సారంగపాణి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా అంకం వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సామా బుచ్చిరెడ్డి, సహాయ కార్యదర్శిగా పగడాల వాసు, కోశాధికారిగా బత్తిని వెంకట్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సారంగపాణి మాట్లాడుతూ మండలంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సమిష్ఠిగా పరిష్కరించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తుక్కాని ఎల్లారెడ్డి, నర్రా రఘువీర్, గుండెబోయిన అనిల్ కుమార్, వేముల సతీష్, జన్నారపు రమేష్, తదితరులు పాల్గొన్నారు.