తెలుగు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ.
డెస్క్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలలో మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా, ఏపీ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఒకేరోజు జరగనున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్
– ఏప్రిల్ 19న తొలిదశ ఎన్నికలు
– ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్
– రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్
– మే 7న మూడో దశ పోలింగ్ – మే 13న నాల్గో దశ పోలింగ్
– *మే 13నే ఏపీ, తెలంగాణలో పోలింగ్*
– మే 20న ఐదో దశ పోలింగ్
– మే 25న ఆరోదశ పోలింగ్
– జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది.