ఎన్నికల విధులు సమర్దవంతంగా నిర్వర్తించాలి

ఎన్నికల విధులు సమర్దవంతంగా నిర్వర్తించాలి

-భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే 

తెలంగాణజ్యోతి, భూపాలపల్లి/కాటారం:ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐ పీ ఎస్ అధికారి అన్నారు. వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని భూపాలపల్లి, మంథని నియోజక వర్గంలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న జిల్లా పోలీసులు, సీ ఆర్ పీ ఎఫ్, బీ ఎస్ ఎఫ్ కేంద్ర బలగాలు, పారెస్ట్, టీ ఎస్ ఎస్ పీ, శిక్షణ కానిస్టేబుళ్లకు జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి నియోజకవర్గం వారికి, కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లోని బీ ఎల్ ఎం గార్డెన్లో మంథని నియోజక వర్గం వారికి శనివారం ఎస్పి కిరణ్ ఖరే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ, ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు పోలింగ్ స్టేషన్ల వద్ద నిర్వర్తించాల్సిన విధులు, పొలింగ్ ముందు, పొలింగ్ రోజు, పొలింగ్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పి వివరించారు. పోలిసు అధికారులు సిబ్బందికి ఏదైనా సందేహాలు ఉంటే పై అధికా రుల వద్ద తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయం ప్రకారం ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. అలాగే పొలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను 100 మీటర్ల పరిధిలో గుమిగూడకుండ చూడాలని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటరు స్లిప్పులు, జిల్లా ఎన్నికల అధికారి అనుమ తి పొందిన ఐడి కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతిం చాలన్నారు. ఎండ తీవ్రత నేపద్యంలో ఓ.ఆర్.ఎస్ మంచి నీటిని ఎక్కువగా తాగుతూ పోలిసు, వివిధ విభాగాల ఎన్నిక ల సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలు, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఎస్పి పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీయంలను స్ట్రాంగ్ రూముల వరకు పోలీసులు తరలించాలని ఎస్పి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డిఎస్పీ ఏ. సంపత్ రావు, గడ్డం రామ్ మోహన్ రెడ్డి, సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ బాబు, BSF అసిస్టెంట్ కమాన్డెంట్ అజయ్, భూపాలపల్లి, చిట్యాల, కాటారం , మహాదేవపూర్ సిఐ లు నరేష్ కుమార్, మల్లేష్, నాగార్జున రావు, రాజేశ్వర్ రావు, ఎలక్షన్ సెల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్ బీ ఇన్స్ పెక్టర్ వసంత్ కుమార్, రిజర్వు ఇన్ స్పెక్టర్లు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, సీ ఆర్ పీ ఎఫ్ , బీ ఎస్ ఎఫ్, ఎస్ ఐ లు, భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలిసు సిబ్బంది, కాటారం ఎస్ ఐ మ్యాక అభినవ్ పాల్గొన్నారు.