అంగరంగ వైభవంగా అష్టాదశ లక్ష బిల్వార్చన అభిషేకాలు
– కుంకుమ పూజా కార్యక్రమాలు.
– వెళ్లి విరిసిన భక్తి భావం తరలివచ్చిన భక్తజనం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం లక్ష బిల్వార్చన కార్యక్రమం శుక్రవారం ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఘనంగా నిర్వహిం చారు. ఉదయం ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విజ్ఞేశ్వర స్వా మి పూజ, రుద్ర హోమం, జ్యోతిర్లింగార్చన, సాయంత్రం ఏడు గంటల నుండి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కుంకుమ పూజను వేద పండితులు పూజ విధానం వివరిస్తూ మహళ లతో పూజా క్రతువులు నిర్వహించారు. వెంకటాపురం చుట్టు పక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో మహిళా సోదరీ మణులు ఆలయానికి తరలి వచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు సక్రమంగా పండాలని, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని, మహిళా భక్తురాళ్ళు కుంకుమ పూజా కార్యక్రమంలో అమ్మ వారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమాలు కు హాజరైన భక్తజన సందోహానికి ఆలయ కమిటీ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష బిల్వార్చన కార్యక్రమం, కుంకుమ పూజా కార్యక్రమాలు, అనుబంద పూజా కార్యక్ర మాలతో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కు భక్తులు పోటెత్తారు.ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యు త్ దీపాలతో అలంకరించడంతో వెంకటాపురం పట్టణానికి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం దేదీప్యమా నంగా వెలిగిపోతూ వెంకటాపురానికి, నూతన భక్తిరస తో కళ కళలాడింది. ఓం నమశ్శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అనే శివ స్వాము లు, స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తులు ఆలయ ప్రాంగణంలో స్వామివారి సన్నిధిలో స్వామివారి సేవలో పాల్గొని భక్తులకు సేవలదించారు. దేవుని నామసమస్మరణ లతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది.