ఐటిఐ అప్రెంటిస్ మేళాలో ఎనిమిది మంది ఎంపిక
– ప్రిన్సిపాల్ బి. యాదగిరి వెల్లడి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో సోమ వారం అప్రెంటిస్ మేళా నిర్వహించారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుండి వివిధ ట్రేడ్లలో ఐటిఐ పాసైన విద్యార్థులు దృవీకరణ పత్రాలతో మేళాలో పాల్గొన్నారు. టాటా అడ్వాన్స్ టెక్నాలజీ కంపెనీకి నలుగురు అప్రెంటిస్ మేళాలో ఎంపిక య్యారు. అలాగే ఎల్ అండ్ టి కంపెనీకి నలుగురు ఎంపిక య్యారు. అప్రెంటిస్ మేళాకు మొత్తం పదిమంది విద్యార్థులు తగు దృవీకరణ పత్రాలతో హాజరయ్యారు. వీరిలో 8 మంది రెండు కంపెనీలకు చెరి నలుగురు చొప్పున ఎంపికైనట్లు వాజేడు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ బి. యాదగిరి మీడియాకు తెలిపారు.