జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కృషి
– ట్రైబల్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు వెంకట్ నాయక్
ములుగు ప్రతినిధి: గిరిజన జర్నలిస్టుల సమస్యల పరిష్కా రం కోసం కృషి చేస్తామని అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు బానోతు వెంకట్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణం లో జరిగిన గిరిజన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షునిగా బానోతు వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్ట అధ్యక్షుడు వెంకట్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలలో జర్నలిస్టు వృత్తిలో ఉన్న గిరిజనులకు తప్పని సరిగా ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటూ కలాన్ని నమ్ముకుని జర్నలిస్టుగా కొనసాగుతున్న ఇండ్లులేని నిరుపేద గిరిజనులకు ఇండ్లు మంజూరు చేయా లని అన్నారు. ఏజెన్సీ జిల్లాలో జిల్లా అక్రిడేషన్ కమిటీలలో గిరిజనులకు ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. జిల్లా అధ్యక్షుడు బానోతు వెంకన్న మాట్లా డుతూ పారదర్శకంగా యూనియన్ అభివృద్ధికి కృషిచేస్తా నని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కలిసి శ్రమిస్తా మన్నారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిరంజీ వి, కార్యదర్శిగా ముకులోతు శరత్, కోశాధికారిగా తురస చంటి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేతావత్ సుధాకర్, గౌరవ అధ్యక్షులుగా భూక్య సునీల్, నాయక్, వైస్ ప్రెసిడెంట్లుగా పూణెం ప్రతాప్, పోరిక సునీల్, కార్యవర్గ సభ్యులుగా యుగేందర్, తెల్లం ఆనంద్, పాయం అజయ్, వాసం నరేందర్ లను ఎన్నుకున్నారు.