గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి

గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి

గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషిt

– రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

– కాటారం నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

– సిసి రోడ్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

– సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో జిల్లా శాఖల అధికారులతో కలిసి మంత్రి భోజనం

కాటారం, తెలంగాణ జ్యోతి : రాష్ట్రంలోని గ్రామాల్లో మౌలిక వసతుల ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్జిల్లా శ్రీధర్ బాబు తెలిపారు ఆదివారం కాటారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్ర మాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఈ సందర్భం గా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రజలు చాలా సార్లు తన దృష్టికి తెచ్చారని అవన్నీ నేడు నెరవేర్చే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. అన్ని పాఠశాల ల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టినట్లు తెలిపారు. పిల్లలను బాగా చదివించాలని ఆ క్రమంలో అన్ని హంగుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలి

రాజీవ్ యువ వికాసం ద్వారా 50 వేల నుండి 4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నామని దరఖాస్తు చేసుకోవాలని పథకం వివరా లను వివరించారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని, మిగిలిన వాటా బ్యాంకు లేదా లబ్ధిదారులు చెల్లించాలని సూచించారు. పధకాన్ని నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సూచించారు. మీరు మరో 10 మందికి ఉపాధి కల్పించాలని తెలిపారు. మే 15 నుండి 26వ తేది వరకు జరుగనున్న సరస్వతి పుష్కర పనులను 35 కోట్ల తో చేపట్టి నట్లు తెలిపారు. టెంట్ సిటి ఏర్పాటు ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పన పనులు చేపట్టినట్లు తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు రావు ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని ఈ క్రమంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కాటారం మండలానికి సంబంధించిన కోటి రూపాయలతో నిర్మించనున్న స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణం (వాలీబాల్ కోర్టు, బాస్కెట్ బాల్ కోచ్, బ్యాడ్మింటన్ కోర్టు,ఓపెన్ జిమ్, క్రికెట్ నెట్) శంకుస్థాపన, 14 లక్షలతో కాటారంలో చిల్డ్రన్స్ పార్క్, 2 కోట్లతో పిడబ్ల్యు రోడ్డు దామరకుంట నుండి మానేరు వరకు బీటీ రోడ్ వరకు, 3 కోట్లతో ఒడిపిలవంచ నుండి గూడూరు జెడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు, 3 కోట్ల,95 లక్షలతో పిడబ్ల్యు రోడ్డు నుండి ధన్వాడ బూడిద పల్లి వరకు బీటీ రోడ్డు, 2 కోట్లతో గుండ్రాతిపల్లి నుండి ఊట్లపల్లి పోచమ్మ దేవాలయం వరకు బీటీ రోడ్డు, కోటి 90 లక్షల రూపాయలతో కాటారం మండలంలోని గ్రామాలలో అంతర్గత సిసి రోడ్డు మరియు సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు మరియు 2005 మహిళా సంఘాలకు3,12,64,235 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి శంకుస్థాపనలు, పంపిణీ చేశారు

వైకుంఠ రథాల ప్రారంభోత్సవం

కాటారం, మహాముత్తారం, మలహర్ రావు, మహాదేవ్ పూర్ మండలాలకు వైకుంఠ రధాలకు అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి ప్రారంభోత్సవం చేసి నాలుగు మండలాలకు అందచేశారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ సిఎస్ ఆర్ నిదులు 20 లక్షలతో అందించిన అంబులెన్స్ పలిమెల మండలానికి మంత్రి మీదుగా ప్రారంభో త్సవం చేసి అందచేశారు. మాజీ సభాపతి శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు పంపిణీ కార్యక్రమాన్ని బిఎల్ఎం గార్డెన్స్ లో మంత్రి కంటి అద్దాలను పేషెంట్లకు అందచేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కాటారం, మహాదేవపూర్, మహ ముత్తారం, మలహర్ రావు, పలిమెల మండల కు సంబంధించి 243 మంది లబ్ధిదారులకు కోటి 90 లక్షల విలువ వేసి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ధన్వాడ పాఠశాలలో 100 డేస్క్ బెంచ్ లను కాటారం మండలానికి సంబంధించిన 8 పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.కాటారం మండల పరిధిలోని ధన్వాడ సబ్ స్టేషన్ లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు 33/11కెవి ఉప విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కాటారంలోని శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాటారం గ్రామ పంచాయతి కార్యాలయం లో 50 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి భవనం ప్రారంభించారు.అనంతరం కాటారం మండలం కొత్తపల్లి గ్రామ నివాసి  వాంకుడోతు సమ్మక్క ఇంట్లో   ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం తో మంత్రి శ్రీధర్ బాబు భోజనం చేశారు. ఈ కార్యక్రమాల్లో డిపిఓ నారాయణరావు, డిఆర్డిఓ నరేష్ పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, ఎంపీ డీవో బాబు, తహసిల్దార్ నాగరాజు, ఎంపిఓ వీరస్వామి తదిత రులు పాల్గొన్నారు.

గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment