వంట కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Written by telangana jyothi

Published on:

వంట కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

– కొత్తగూడెం ఎమ్మెల్యేకు విన్నవించిన సీపీఐ జిల్లా కార్యదర్శి రవీందర్​

హన్మకొండ ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మధ్యహ్నా భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అసెంబ్లీలో చర్చించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంపాల రవీందర్​, వంట కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు హన్మకొండలోని హరిత హోటల్ లో జరుగుతున్న సీపీఐ నిర్మాణ మహాసభలకు హాజరైన సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును మర్యాద పూర్వకంగా కలిసి వంట కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించా లని విన్నవించారు. ఈ సందర్భంగా రవీందర్​ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల రాష్ర్ట నాయకత్వంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని కలవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా తాను కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చిస్తానని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారన్నారు. ప్రభుత్వం మిడ్​ డే మీల్స్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రవీందర్​ డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహయ కార్యదర్శి ధర్ముల రామ్మూర్తి, రాష్ట్ర సమితి సభ్యులు గడ్డం లలిత, హన్మకొండ జిల్లా సమితిసభ్యులు ,మేకల హేమలత, నర్ర రమ, మాటూరి స్వరూప, మంతుర్తి శోభ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment