కేంద్ర మంత్రి అమీత్ షా దిష్టిబొమ్మ దగ్ధం
– అంబేద్కర్ మహానుభావుడి విగ్రహానికి పాలాభిషేకం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : కేంద్ర మంత్రి అమీత్ షా రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ అతిధి గృహం ఎదురుగా కేంద్ర మంత్రి అమీత్ షా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మహానుభావుడు విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. కేంద్ర మంత్రి డౌన్, డౌన్, రాజ్యాంగ నిర్మాత మహానుభావుడిపై వ్యాఖ్యలు వెంటనే కేంద్ర ఉపసంహరించుకోవాలని, మంత్రివర్గం నుండి భర్త రఫ్ చేయాలని నాయకులు నినాదాలు చేశారు, ఈ సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలతో, కేంద్రమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్ర మంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, కాంగ్రెస్ నాయకులు బాల సాని వేణు, శ్రీరాముల రమేష్ ,కాల్వ సుందర్రావు, మంచాల భూషణం, ఎస్.సి.సెల్ నేత శ్రీ ని వాస్, రామకృష్ణ, పల్నాటి ప్రకాష్, మాజీ ఎంపిటిసి రవి, సాధన పెళ్లి చిట్టిబాబు, శ్రీను, పలువురు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.