అధికారులకు ఎదురుపిల్ల పండుగ ఆహ్వానం
– ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఆదివాసి నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి, అదనపు రెవెన్యూ కలెక్టర్ వేణుగోపాల్, ఎంపీడీఓ, డీటీకి గట్టమ్మ ఎదురు పిల్ల పండగ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక పోడ్ ములుగు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ మాట్లాడుతూ ఈ నెల 14న గట్టమ్మ ఎదురుపిల్ల పండుగ జరుగుతుందని అన్నారు. గట్టమ్మ ప్రధాన పూజారులు గట్టమ్మ తల్లికి బోనం సమర్పించిన అనంతరం నాయక పోడ్ కులస్తుల సమ్మేళన సభను గట్టమ్మ దేవాలయం వద్ద హరిత హెూటల్ పక్కన సాయంత్రం 4 గంటలకు భోజన అనంతరం నిర్వహించడం జరుగు తుందని అన్నారు. కార్యక్రమంలో ములుగు గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త సదయ్య,కొత్త లక్మయ్యా ఆకుల మొగలి అరిగెల సమ్మయ్య ఆకుల రాజు కొత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు.