వెంకటాపురం విజన్ స్కూల్ లో ముందస్తు ఉగాది వేడుకలు
– నవోదయలో సీట్ లు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురంలోని విజన్ స్కూల్లో ముందస్తు ఉగాది పండుగ వేడుకలను శనివారం ఘణంగా నిర్వహించారు. విద్యార్థులందరూ సాంప్రదాయబద్దమైన వస్త్రాలు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. అధ్యాపక బృందం పిల్లలకు ఉగాది గొప్పతనం, ఉగాది పచ్చడి తయారీ విధానం తయారు చేసి చూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెంకటాపురం మండల తహసీల్దార్ పి.లక్ష్మీ రాజయ్య హాజరై పిల్లలకు స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇచ్చి పిల్లలను ఉత్సాహపరిచారు. నవోదయ 2025 పరీక్షలో 6వ తరగతి లో సీట్ సాధించిన చిన్నారులైన విద్యార్థిని కందుకూరి జాహ్నవి, మరియు వేముల సాహుల్ సాయిలను అభినందించి వారికి బహుమతి ప్రదానం చేసారు. ఈకార్యక్రమంలో విద్యార్థుల తల్లి దండ్రులు, స్కూలు కరస్పాండెంట్ బాహుబలేంద్రుని వెంకట రామారావు, ఉపాధ్యా య బృందం, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.