వెంకటాపురం చర్ల ప్రధాన రహదారిపై లేస్తున్న దుమ్ము,దూళీ

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం చర్ల ప్రధాన రహదారిపై లేస్తున్న దుమ్ము,దూళీ

– అనారోగ్యం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు. 

– పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : వెంకటాపురం టు చర్ల ప్రధాన రహదారి మరమ్మత్తులు ప్రారంభించి రెండు న్నర సంవత్సరాల కావాస్తున్న నేటికి పూర్తి కాకపోవడంతో ఇసుక లారీల కారణంగా మెటలు పరిచిన రహదారిపై రాక పోకలు సాగిస్తుండడంతో పెద్ద ఎత్తున దుమ్ము లేచి గ్రామాలపై కప్పుకు పోతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో పాటు అనారోగ్యం పాలవుతున్నారు. మెటల్పరి చి నెలలు కావస్తున్న బీ.టీ. వేయక పోవడంతో వందలాది ఇసుక లారీల రాకపోకల కారణంగా రహదారి కి ఇరువైపులా ఉన్న గ్రామాలపై తెల్లటి మంచు తెరలాగా కప్పుకుపోతున్నది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో పాటు, అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాక చంటి పిల్లలు, చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం, జలుబు దగ్గు, శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బందులు పడుతు  వ్యాధుల కు గురవుతున్నారు. ఉతికిన దుస్తులను సూర్యరశ్మికి ఆరబె ట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని, రహదారికి  ఇరువైపులా సుమారు 40 గ్రామాలకు చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి నాలి తో పాటు వ్యవ సాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న గిరిజన, గిరిజనేతర మధ్య తరగతి కుటుంబాలు పేద కుటుంబాలు పాలకుల అవినీతి కారణంగా ఇబ్బందులు పాలవుతున్నామని శాపనా ర్ధాలు పెడుతున్నారు .అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణం సైతం ఇసుక లారీల దుమ్ము,దూళీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు గుర్తుకు వచ్చి నప్పుడల్లా ట్యాంకర్లతో నీళ్లు చల్లి తూతూ మంత్రంగా ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారని, గత రెండున్నర మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు నిర్వహించిన అధికార యంత్రాంగం పట్టించు కోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్ల లో ఒకరని, ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వారు కావడంతో, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భవిష్యత్తు కార్యాచరణ కోసం వెంకటాపురం టు చెర్ల ప్రధాన రహదారి మరమ్మత్తులు చేయాలని,  రహదారి ఇరు వైపుల ఉన్న గ్రామాల ప్రజలు వారి వారి గ్రామాల వద్ద రోడ్డుపై బైఠాయించి, 24 గంటల రహదారి బందుకు సంఘటితంగా పిలుపునిస్తున్నట్లు విశ్వ సనీయ సమాచారం.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now