వెంకటాపురంలో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు
– వెళ్లి విరిసిన భక్తి భావం.
– దేవాలయాలకు తరలివచ్చిన భక్తజనం.
– వెంకటాపురంలో భక్తి రస సందడి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పట్టణంలో శ్రీ కనకదుర్గమ్మ వారి శరన్నవ రాత్రుల మహోత్సవాలు, దసరా పండుగ సందర్భంగా దేవాల యాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శనివారం వేకువ జాము నుండే భక్తులు మండల కేంద్రంలోని దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వెంకటా పురం లోనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం వద్ద భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలు కట్టారు .అలాగే విజయద శమి దసరా పండుగ సందర్భంగా వారి, వారి ఇంధన శకటాల కు పూజలు నిర్వహించి, విజయదశమి పండగ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలతో భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద భక్తులకు శనివారం మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి దసరా పండుగ రోజు శ్రీ రాజరాజేశ్వరి తల్లి కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కాగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆల యం నుండి శనివారం సాయంత్రం దేవాదాయ శాఖ ఆధ్వ ర్యంలో శమీ పూజకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్ర హాలతో పల్లకి సేవలో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు మధ్య, భక్తుల జేజేల మధ్య వెంకటాపురం ఊరి చివర ఉన్న మండపం వద్దకు స్వామివారు పల్లకి సేవలో చేరుకున్నారు. స్వామివారి మండపం వద్ద వేద పండితులు, సీనియర్ పురో హితులు ప్రత్యేక పూజలు,జమ్మి పూజలు నిర్వహించి, బాణా లను ఎక్కుపెట్టి, దైవభక్తి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టు ఆకులను భక్తులు ఒక్కసారిగా తోపులాటలతో జమ్మి ఆకులను దక్కించుకొని కళ్ళకు అద్దుకొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. అలాగే శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద నుండి శ్రీ అమ్మవారు, శ్రీ రాజరాజేశ్వరి దేవి, కాత్యాయని అవతారంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ట్రాక్టర్ లో అలంకరించి, వెంకటా పురం పట్టణ పురవీధులలో శనివారం రాత్రి ఊరేగింపు జరి పారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ కనకదుర్గమ్మ తల్లి వాహ నానికి శుద్ధిజలంతో స్వాగతం పలుకుతూ, టెంకాయలు పసుపు, కుంకాలతో ఘణ స్వాగతం పలికారు. దసరా పర్వదినం రోజు అమ్మవారు దర్శన భాగ్యం కల్పించారని ప్రజలు, భక్తులు నిర్వహించారు.