ఘనంగా దుద్దిళ్ళ శ్రీను బాబు జన్మదిన వేడుకలు
– 51 కిలోల భారీ కేకుతో సంబరాలు
కాటారం, తెలంగాణ జ్యోతి : శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీను బాబు జన్మదిన వేడుకలు శనివారం మండలం కేంద్రం లోని అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనం గా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడ లితో పాటు వివిధ గ్రామాలలో శ్రీను బాబు జన్మదిన సందర్భం గా కేకులు కట్ చేసి పేద ప్రజలకు పంపిణీ చేశారు. 51 వ పుట్టినరోజును గుర్తుచేసేలా 51 కిలోల భారీ కేకును కట్ చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ తండ్రి ఆశయ సాధనలో శ్రీధర్ బాబుకు వెన్నంటే ఉంటూ అనునిత్యం ప్రజల అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కరించడంలో ముందుంటారని పేర్కొన్నారు. శ్రీను బాబు జీవితంలో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్న త శిఖరాలను ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు ఎర్రవేల్లి విలాస్ రావ్, మండల యూత్ అధ్యక్షులు చీమల సందీప్, మహిళ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపిటిసి జాడి మహేశ్వరి, కొట్టే ప్రభాకర్, సుందిల్ల ప్రభుదాస్, గంగిరెడ్డి లచ్చిరెడ్డి, రమేష్, మాచర్ల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.