డిటిఎఫ్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: డెమోక్రటిక్ టీచర్ ఫెడరే షన్ 2025 క్యాలెండర్ , డైరీ నీ కాటారం ఎంఈఓ శ్రీదేవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్య వ్యవస్థలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయా లని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. విద్య రంగానికి 30 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజేశం, జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, సంఘం బాధ్యులు లక్ష్మణ్ నాయక్, హట్కర్ సమ్మయ్య, రాజు నాయక్, రాజయ్య, నాగరాజు, బోజ్య నాయక్, విజయలక్ష్మి, కవిత, రజిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.