మాదకద్రవ్య నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

Written by telangana jyothi

Published on:

మాదకద్రవ్య నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం యువతను కాపాడుకుందాం అంటూ మాదకద్రవ్యాల నిర్మూలన పోస్టర్లను ఆదివారం ఏటూరు నాగారం ఏఎస్పి శివమ్ ఉపాధ్యాయ. సిఐ అనుముల శ్రీనివాస్. ఎస్సై తాజొద్దీన్, రెండవ ఎస్సై రమేష్ లు ఆవిష్కరించారు. జెడ్పి స్కూల్ గ్రౌండ్ లో పోలీసుల ఆధ్వర్యంలో  క్రీడలను నిర్వహించగా ఏఎస్పీ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యస నాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని యువతకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వర్కింగ్ జర్న లిస్ట్ యూనియన్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు గంపల శివకుమార్, ఏటూరు నాగారం ప్రెస్ క్లబ్ కార్యదర్శి అలువాల శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు, వ్యాయామ ఉపాధ్యా యులు, యువత  పాల్గొన్నారు.

Leave a comment