వడదెబ్బతో డ్రైవర్ మృతి
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ఆకులవారి గణపురంకు చెందిన డ్రైవర్ అమీన్ ఖాన్(40) ఆదివారం వడదెబ్బతో మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. అమీన్ ఖాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అల్లుముకున్నాయి. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు గౌసియా, సాదిక్, అమిద్ అహ్మద్ లు ఉన్నారు. నిరుపేద మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని వారికి చేయూతనందించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.