పుట్టిన రోజున గొప్ప మనస్సు చాటుకున్న డాక్టర్ మౌనిక
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక తన పుట్టిన రోజు సందర్భంగా 30 మందికి హెల్మెట్స్ అందించి గొప్ప మనసును చాటుకున్నారు. సంప్రదాయ పద్దతిగా కుటుంబ సభ్యులతో జరుపు కోవటం అనేది కాకుండా ఈ మధ్య కాలములో చాల మంది యువత ద్విచక్ర వాహనాలు తో ఆక్సిడెంట్ రూపంలో తలకు బలమైన గాయాలు తగిలి మరణిస్తున్న అనేక సంఘటనలు చూసి చలించిన డాక్టర్ మౌనిక గొప్ప ఆలోచనతో స్వయం కృషి స్వచ్చంద సంస్థని సంప్రదించారు. వారు చేస్తున్న అనేక కార్యక్రమాలను చూస్తున్న ఎంతోమంది యువతకి మార్గదర్శ కులుగా ప్రతి రోజు ఎదో ఒక కారణముతో రోడ్డు ప్రమాదాలలో ఆసువులు బాస్తున్న ఎంతో మంది యువతకు ఆపన్న హస్తము ఇవ్వాలని 30 మంది గ్రామీణ ప్రాంతములో వివిధ రంగాలలో పనిచేస్తున్న యువతకి హెల్మెట్స్ అందించారు. ఈ సందర్భ ముగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ నేటి సమాజంలో యువత అందరు కూడా ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని ప్రమాదాలు జరిగినపుడు హెల్మెట్ ఉంటే ప్రమాదం నుండి బయట పడవచ్చు అని వారు తెలిపారు. తన పుట్టిన రోజున స్వయంకృషి స్వచ్ఛంధ సేవ సంస్థ ఆధ్వర్యములో నన్ను భాగ్యస్వామి చేసి, నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన స్వయంకృషి ఫౌండర్ కొట్టే సతీష్ కి, సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రములో స్వయం కృషి సభ్యులు గ్రామ యువకులు పాల్గొన్నారు.