ఏటూరునాగారంలో పోలీసుల ఇంటింటి తనిఖీలు
ఏటూరునాగారంలో పోలీసుల ఇంటింటి తనిఖీలు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని ఐటిడిఏ క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారు జామున జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశానుసారం సీఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు శుక్రవారం ఎస్సై తాజుద్దీన్,పోలీస్ సిబ్బంది ముమ్మరంగా ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ఇంటి యజమానులు, అద్దెకు ఉంటున్న వారి వివరాలను క్షుణ్ణం గా పరిశీలించారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. వాహనాల యొక్క ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై తాజుద్దీన్ మాట్లాడుతూ కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని. తెలియ ని వారికి ఇండ్లు అద్దెకు ఇవ్వద్దన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచ రిస్తే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్ర మంలో సివిల్ సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.