అపరిచిత వ్యక్తులకు పాత సెల్ ఫోన్స్ అమ్మ వద్దు 

Written by telangana jyothi

Published on:

అపరిచిత వ్యక్తులకు పాత సెల్ ఫోన్స్ అమ్మ వద్దు 

– సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు 

– ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

– జిల్లా ఎస్పి శబరిష్

ములుగు ప్రతినిధి : అపరిచిత వ్యక్తులకు పాత సెల్ఫోన్లు లేదా పాడైన సెల్ఫోన్లు అమ్మకూడదని, వాటితో నేరాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ సూచించా రు. గ్రామాల్లో పాత సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తామని పలు వురు తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అజ్ఞాత వ్యక్తులు ఎవరైన పాత మొబైల్స్ లేదా పాడైన మొబైల్స్ కొంటాం అంటూ మీ దగ్గరికి వస్తె అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల్లో వినియోగిం చేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. సుమారు 4000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారన్నారు. పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని, డివైజ్ ఐడెంటిటీ కారణంగా అమ్మకం దారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమాని స్తున్నారన్నారు. అందువల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ అమ్మినచో అమ్మకందారులు కూడా నేరస్తులుగా పరిగణించ బడుతారని తెలియచేసారు. ఇటువంటి సైబర్ కేటుగాళ్ల ముఠాల వల్ల అమాయక ప్రజలు తమ కష్టార్జితం ద్వారా సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని, కావున ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని ఎస్పీ సూచించారు.

Leave a comment