పుష్కరాల్లో సామాన్యులకు సౌకర్యాలు అక్కర్లేదా..
– సరస్వతీ పుష్కరాలను నీర్వీర్యం చేస్తున్న మంథని ఎమ్మెల్యే
– ఉద్యమం సమయంలో పుష్కరాలను ఘనంగా జరుపుకున్నం
– ఒక్క విఐపీలకు మాత్రమే సకల సౌకర్యాలు కల్పిస్తే ఎట్లా
– పుష్కరాల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం , తెలంగాణ జ్యోతి : పన్నెండ్లకోసారి వచ్చే సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానాలకు వచ్చే సామాన్యులకు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గు చేటు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరినదిలో ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన పుష్కర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానుం డగా ఎక్కడ కూడా పనులు పూర్తి కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరూ కలిసి సరస్వతీ పుష్కరాలను నిర్వీర్యం చేసిండ్లని ఆయన ఆరోపిం చారు. గోదావరినది ఒడ్డున సరస్వతీ అమ్మవారి మండపాన్ని చూస్తే పుష్కర పనులు ఎలా చేస్తున్నారో అర్థం అవుతుంద న్నారు. మంథని ఎమ్మెల్యే మంత్రిగా ఉండగా ఆయన సతీమణి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉందని, వీరిద్దరు సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ఉన్నా ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సరస్వతీ పుష్కరాలు గతంలో రాజమండ్రిలోమాత్రమే జరిగేవ ని, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ డిమాండ్ మేరకు గోదావరినదిలో పుష్కరాలు జరుపుకునే అవకావం వచ్చిందని, 2013లో సరస్వతీ పుష్కరాలను ఘనంగా జరుపుకున్నామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారి జరుపుకునే సరస్వతీ పుష్కరాలపై మంథని ఎమ్మెల్యే పట్టింపులేమి దోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. పుష్కరాల నిర్వహణపై ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గత ఏడాది సెప్టెంబర్‌లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిం చగా మంథని ఎమ్మెల్యే ఈ ఏడాది జనవరిలో రివ్వూ మీటింగ్ నిర్వహించారని, పలుమార్లు రివ్యూ మీటింగ్‌లు నిర్వహించినా పనులు పూర్తికాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పుష్కరాల కు లక్షలాది మంది తరలివచ్చే సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. స్నానాలు చేసేందుకు వసతులు లేవని, టాయిలెట్లు, అపరకర్మ మండపం పూర్తి చేయలేద న్నారు. కేవలం వీఐపీలకు సంబంధించిన పనులను మాత్రమే పూర్తి చేశారని, ఈ పుష్కరాలకు సామాన్యులకు అనుమతిస్తరా లేదా అనే అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. సాక్ష్యాత్తు సరస్వతీ అమ్మవారు ఆవిర్బవించిన చోటునే పుష్కరాలు ప్రారంభం అవుతాయని చెప్తున్నారని, అక్కడ మాత్రం వీఐపీలకు సకల సౌకర్యాలు కల్పించారని ఆయన ఎద్దేవా చేశారు. వీఐపీలకు అంగరంగ వైభవంగా గుడారాలు ఏర్పాటు చేశారని, ముఖ్యమంత్రి వస్తుండ్లని హెలీప్యాడ్‌ను పూర్తి చేశారని, వసతులు కల్పించారని ఆయన వివరించారు. పుష్కర పనులను ఎలాంటి నైపుణ్యం లేనివాళ్లకు అప్పగించా రని, అధికారులు క్వాలిటీ చేయడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మంథని ఎమ్మెల్యే ఆయన సతీమణి పుష్కరాలను పవిత్రంగా నిర్వహిం చాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరమన్నారు. ప్రస్తుతం ఇక్కడ పనులు, ఏర్పాట్లను చూస్తే ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఎన్నికలు వస్తే నోట్ల సంచులతో వచ్చి ఓట్లు దండుకోవచ్చనే ఆలోచనతో మంథని ఎమ్మెల్యే ఉన్నాడని, ప్రజల ఆకాంక్ష, మనోభావాలను గౌరవిం చడం లేదన్నారు. పలుమార్లు రివ్యూ మీటింగ్‌లు కమీషన్‌ల కోసమే పెట్టారని, ఈ క్రమంలోనే నాణ్యత లేని పనులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సరస్వతీ పుష్కరాల్లో జరుగిన పనులపై క్వాలిటీ పరీక్షలు నిర్వహించా లని, సమగ్ర విచారణ జరిపించడంతో పాటు పనులకు సంబంధించిన నిధులు, పనులు, టెండర్ల జారీ ప్రక్రియపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పుష్కరాల్లో సామాన్యులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించా లని, లేని పక్షంలో తాము బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.