అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడొద్దు
– సీతక్కకి క్షమాపణ చెప్పాలి.
– ఎస్టీ సెల్ వెంకటాపూర్ మండల అధ్యక్షుడు మూడు వీరేష్
ములుగు, తెలంగాణ జ్యోతి : అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడొద్దని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ వెంకటాపూర్ మండల అధ్యక్షులు మూడు విరేష్ అన్నారు. బుధవారం లక్ష్మిదేవిట గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీతక్క మాట్లాడిన మాటలు సబబు కాదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంటనే సీతక్కకి బహిరంగ క్షమాపణ చెబుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో సభా మర్యాద లేకుండా ప్రవర్తించడం అతని మానసిక స్థితి బాగు లేదనడానికి నిదర్శనం అని అతనిని అసెంబ్లీకి కాకుండా పిచ్చాసుపత్రికి పంపడం మంచిదని అన్నారు. అడవి బాట నుండి ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజలకు ఇంకెన్నో మంచి పనులు చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే నిత్యం పోరాటం చేస్తు ఇంత స్థాయికి వచ్చిన వ్యక్తి మన సీతక్క అని అన్నారు. అటువంటి వ్యక్తి మీద ఎవరో మెప్పుకోసం అసెంబ్లీలో అంత దిగజారుడుతనంగా మాట్లాడడం కౌశిక్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం అని అయన అన్నారు . సీతక్క గురించి అమర్యాదగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి నీకు ఆమె గురించి తెలియాలంటే నీ జీవితకాలం కూడా సరిపోదు అని ఇప్పటికైనా మంత్రి సీతక్క గురించి తెలుసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనియెడలో తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరు అని ఆయన అన్నారు.