క్షుద్ర పూజలను నమ్మవద్దు : డిఎస్పి రామ్మోహన్ రెడ్డి
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి:క్షుద్ర పూజలు, మూడ నమ్మకాలు నమ్మవద్దని కాటారం సబ్-డివిజన్ లోని గ్రామాల ప్రజలకు కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఇటీవల గతకొంత కాలంగా కాటారం సబ్ డివిజన్ లోని కొన్ని గ్రామాల్లో గల ప్రతి మూడు రోడ్ల కూడళ్ళలో రాత్రి సమయా ల్లో ముగ్గులు వేసి పసుపు, కుంకుమలు కలిపిన అన్నం ముద్దలు, నల్లకోడి, ఏదుకోడి, కొడిగుడ్లు, నిమ్మకాయలతో పాటు వండిన మాంసం, లాంటి వస్తువులను పెడుతూ అమా యక ప్రజలను భయందోలనలకు గురిచేస్తున్నారని అలాంటి వ్యక్తులపైన కటినమైన చర్యలు తీసుకుంటామని సూచిం చారు.అంతేకాక అనారోగ్యంతో ఉన్న ప్రజలను మోసపూరిత మాటలతో నమ్మించి, వారికి క్షుద్ర పూజలుచేసి వారి అనారో గ్యాన్ని గాని, ఆర్థిక, మానసిక బాధలను దురం చేస్తామని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పుతూ, సులభంగా డబ్బులు సంపాదించే ఆలోచనతో కొందరు వ్యక్తులు గ్రామాల్లో క్షుద్ర పుజలు చేస్తున్నట్టుగా తెలిసిందన్నారు. అక్రమ జీవనో పాధిని ఎంచుకొని వారి పబ్బం గడుపుకుంటూ గ్రామాల్లోని అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తు న్నారని సమాచారం ఉందని, అలాంటి వ్యకులను నమ్మి, వారి మాయ మాటలకూ మోసపోవద్దని ప్రజలకు సూచించా రు. అలాంటి వ్యక్తుల గురించి సరైన సాక్ష్యాదారాలతో పోలీ సులకు పిర్యాదు చేసినట్లైతే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అంతేకాక అలాంటి వారిని ప్రోత్సహించుతు న్న లేదా అనుసరించుతున్న వ్యక్తులకుడా పైన కుడా చట్టప రంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు. ఇటివల మహదేవపూర్ మండలంలో జరిగిన రెండు క్షుద్ర పూజలకు సంబందించిన సంఘటనల్లో నిందితులపై కేసులు నమోదుచేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపా రు. ప్రజలందరూ కూడా శాస్త్రీయమైన ఆలోచనలతో ఉండాల ని, ఏమైన శారీరక మానసిక పరమైన అనారోగ్య సమస్యలు ఉంటే దైర్యంగా దగ్గర్లోని ఆసుపత్రిలో చూపించుకోవాలని, ఒకవేళ అక్కడ తగ్గకపోతే పెద్ద స్థాయి ఆసుపత్రిలో మాత్రమే చూపించుకోవాలని, అలాకాక ప్రజలు క్షుద్ర పూజల కొరకు క్షుద్ర పూజారులను సంప్రదించవద్దని, వారి వల్ల ఎలాంటి అనారోగ్యాలు తగ్గవని, పైగా అలాంటి వారి మాటలునమ్మి ఆర్థికంగా నష్టపోయి, శారీరకంగా అనారోగ్యాన్ని పెంచుకొని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.