జూనియర్ కళాశాలకు రూ.10 వేల ఫర్నీచర్ విరాళం
జూనియర్ కళాశాలకు రూ.10 వేల ఫర్నీచర్ విరాళం
– కళాశాలకు అందజేసిన మండల సిపిఎం పార్టీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సిపిఎం మండల కమిటీ, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రూ.10 వేల విలువ చేసే ఫర్నీచర్ ను మంగళవారం కాలేజీ ఇంచార్జీ అమ్మిన శ్రీనివాసరాజు కు అందజేశారు. అనంతరం తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కు ఉపయోగపడే విద్యార్థులకు సిపిఎం పార్టీ మండల కమిటీ ఫర్నీచర్ ఇచ్చినందుకు వారిని అభినందించారు. ముందు ముందు కళాశాల అభివృద్ధి కి సిపిఎం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గ్యానం వాసు, మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, మండల నాయకులు కట్ల నర్సింహ చారి, వీరవేణి, మాణిక్యం, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.