వాజేడు కస్తూర్భా విద్యాలయానికి పుస్తకాల బహుకరణ
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు.జిల్లా వాజేడు మండల కేంద్రంలోని, కస్తూరిబా విద్యాలయానికి వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకులు రచయిత డాక్టర్. అమ్మిన శ్రీనివాసరాజు శనివారం విద్యార్థులకు ఉప యుక్త మైన పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యాలయ ప్రత్యేక అధికారాణి ముదిగొండ సుజాతకు ఫుస్తకాల ను అందజేశారు., గిరిజన సాహిత్యం, బాల సాహిత్యం, శతక సాహిత్యం, వ్యక్తిత్వ వికాసాలకి, ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన విలువైన ఈ పుస్తకాలను విద్యార్థులు చదివి, తమ విద్యా వికాసా న్ని పెంపొందించుకోవాలని డా.శ్రీ నివాసరాజు కోరారు. ఈ కార్యక్ర మంలో కామర్స్ లెక్చరర్ దూమాల నరసింగరావు, లైబ్రేరియన్ చింతూరి జయలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “వాజేడు కస్తూర్భా విద్యాలయానికి పుస్తకాల బహుకరణ”