గ్రంథాలయానికి పుస్తకాల అందజేత

Written by telangana jyothi

Published on:

గ్రంథాలయానికి పుస్తకాల అందజేత

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లాలోని ఎంపిక చేయబడిన 50 పాఠశాలలకు లైబ్రరీ బుక్స్ ను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా గురువారం వెంకటా పురం ఉన్నత పాఠశాల గ్రంథాలయానికి బాల రక్ష భారత్  సంస్థ ఆధ్వర్యంలో వంద పుస్తకాలు, డస్ట్ బిన్లను అంద జేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ జి .వి .వి. సత్యనారాయణ మాట్లాడుతూ లైబ్రరీ బుక్స్ పిల్లలకు ఎంతగానో ఉపయోగ కరంగా ఉంటాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల న్నారు. లైబ్రరీ బుక్స్ తమ పాఠశాల తో పాటు మండలంలోని 9 ఎంపిక చేసిన పాఠశాలలో పంపిణీ చేసీనందుకు బాల రక్షభారత్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాల రక్షా భారత్ ఎ.ఎస్.ఏఫ్ శ్రీకాంత్ మాట్లాడుతూ పిల్లల్లో పఠన నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బొల్లే శ్రీనివాస్, రాందేవ్, వెంకటేష్, బిక్షపతి, నాగమని, రామకోటి, ప్రదీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now