నూగూరు గ్రామంలో పిచ్చికుక్కల స్వైర విహారం
– కుక్క కాటుతో గాయపడ్డ వారిని వైద్యశాల కు తరలింపు
– మెరుగైన వైద్యం కోసం ఇరువురిని ఏటూరు నాగారం తరలింపు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు గ్రామంలో ఆదివారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురిని కరడం తో గాయాల పాలయ్యారు. వీరిని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఇద్దరికీ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ధ్వార ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర రక్త స్రావం జరిగిన పెద్ది లక్ష్మయ్య ను ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించనున్నట్లు సమాచారం.
– కుక్కకాట్ల కు గురైన వారికి మెరుగైన వైద్యం : ములుగు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అప్పయ్య
వెంకటాపురం మండలం నూగూరు గ్రామంలో కుక్క కాట్ల కు గురైన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. ఎటూరునాగారంలో తరలించిన పెద్ది లక్ష్మయ్య ఇండ్ల వెంకటే ష్ లకు మెరుగైన ప్రత్యేకమైన వైద్యం అందిస్తామని, అవసర మైతే ములుగు లేక, వరంగల్ ఎంజీఎం కు తరలిస్తామని తెలిపారు.