అపరిచితుల ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు

అపరిచితుల ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు

అపరిచితుల ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు

– 9836330846 నెంబర్ తో ఉద్యోగాల పేరిట మోసం

– డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య  

ములుగుప్రతినిధి:నిరుద్యోగ యువతీ, యువకుల అమాయ కత్వాన్ని ఆసరా చేసుకొని కొందరు మోసపూరితంగా వ్యవ హరిస్తున్నారని, 9836330846 నెంబరు నుంచి ఫోన్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తున్నా రని, వారి మాటలు నమ్మొద్దని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సదరు నేరగాళ్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో స్టాఫ్ నర్సులు, ఎంఎల్హెచ్ పి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఇలాంటి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మోస పోవద్దని, ఒకవేళ ఏదైనా పోస్ట్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన, ప్రస్తుతం పని చేస్తున్న వారిలో ఏదైనా పోస్ట్ ఖాళీ అయినా నిబంధనల మేరకు డిస్టిక్ సెలక్షన్ కమిటీ, కలెక్టర్ అనుమతితో మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారన్నారు. అనంతరం పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులు ఒకవేళ మోసానికి గురైతే తమకు దరఖాస్తు ఇస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment