దళితుల మధ్య చిచ్చుపెట్ట వద్దు 

Written by telangana jyothi

Published on:

దళితుల మధ్య చిచ్చుపెట్ట వద్దు 

– ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలి

 – వర్గీకరణ వద్దు – ఐక్యతే ముద్దు

– క్రిమిలేయర్ ముసుగులో రిజర్వేషన్ ఎత్తివేతకు కుట్ర

– మాల ఐక్యవేదిక ములుగు జిల్లా కన్వీనర్ గంపల శివకుమార్

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : దళితుల మధ్య చిచ్చుపెట్టే ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు పునరా లోచన చేయాలని, క్రిమిలేయర్ ముసుగులో రిజర్వేషన్ల ఎత్తి వేతకు కుట్రగా తాము భావిస్తున్నామని, ఐక్యంగా ఉన్న దళి తులను విడదీయడానికి కుట్ర జరుగుతుందని. వెంకటాపురం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వెంకటాపురం తాసిల్దార్ కార్యాల యంలో అధికారులకు అందజేశారు. ముందుగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంగళ వారం సాధన పెళ్లి చిట్టిబాబు అధ్య క్షతన మాలల ఐక్యవేదిక సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు నాయ కులు మాల ఐక్యవేదిక ములుగు కన్వీనర్ గంపల శివకు మార్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ భవిష్య త్తులో మరిన్ని పోరాటాలు చేయడానికి మాలలు సిద్ధంగా ఉండాలని కోరారు.యస్. సి మరియు యస్. టి వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కు నిరసనగా తేలపడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ కులాలను వర్గీకరణ చేయుటకు రాజ్యాంగం లోని ఆర్టికల్ 341 పరిగణలోకి తీసుకోకుండా, వర్గీకరణ పై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరియు సూచనలను అన్ని రాష్ట్రాలలో మెజారిటీ దళితులు, గిరిజనులు పార్లమెంటు సభ్యులు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘాలు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా బహజన శక్తి పార్టీ, సమాజ్వాది పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, సమతా సైనిక్ దళ్ వ్యతిరేకి స్తున్నారు. అంతే కాకుండా ఇది పూర్తిగా ఎస్పీ, ఎస్టీ లను రాజకీయ అధికారంకు దూరం చేసే ఉద్దేశంతో ఉన్నది. అందు వల్లనే ఈ తీర్పు పై దేశ వ్యాపితంగా ఆందోళనలు జరుగు చున్నవి.కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ను పునః పరిశీలించి ఇట్టి తీర్పును వాపసు తీసుకోవాలని కోరుతున్నాము. అదే విధం గా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లోని గైడ్ లైన్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఇట్టి తీర్పు షెడ్యూల్ కులాల అభివృద్ధికి నిరోధకముగా ఉన్నందున, ఉప కులాల వారిగా వర్గీకరణ చేయుటకు సాధ్యం కాదని గౌరవ రాష్ట్రపతి కి పంపాలని కోరారు.  కావున ప్రజా మనోభావాలను, అర్ధం చేసుకొని వర్గీకరణ నిలిపివేయాలని తీర్పును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని, రివ్యూ పిటిష న్స్ వేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యస్. సి మరియు యస్ .టి .కులాల అభివృద్ధి, పై శ్వేత పత్రం విడుదల చేయాలనీ, పెరిగిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ పెంచాలని, ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్స్ అమలు చేయాలనీ, బ్యాక్ లాగ్ పోస్టులు, వెంటనే భర్తీ చేయాలనీ, అసైన్మెంట్ భూములు ఎస్సి, ఎష్టి, నిరుపేదలకు పంపిణి చేయాలి, అత్యంత వెనుక బడిన కులం వారికీ ప్రత్యేక కార్యాచరణ చేసి వారి అభివృద్ధికి కృషి చేసి షెడ్యూల్ కులాల మధ్య హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమన్యాయం చేయాలని అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు పై అనుచిత వాక్యాలు చేయడం సరైనది కాదన్నారు. వర్దనపేట నియోజకవర్గంలో గతంలో మంద కృష్ణ మాదిగ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు డిపాజిట్ ఎందుకు కోల్పోయారో మాదిగలు ఆత్మ విమర్శ చేసుకోవా లన్నారు. దళితుల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొట్టే వాక్యాలు చేయడం మానుకోవాలన్నారు.ఈనెల 25 నుండి గ్రామస్థాయి నుండి పాదయాత్ర కార్యక్రమంలు చేపట్టి గ్రామ స్థాయి నుండి మాలలను చైతన్యవంతం చేయడం జరుగు తుందన్నారు.

-నూతన ఆడహక్ కమిటీ ఎన్నిక 

ఐక్య వేదిక కమిటీ సభ్యులు అడహక్ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. జిల్లా కో కన్వీనర్ సాధన పల్లి చిట్టిబాబు, అధ్యక్షులు మంచాల భూషణం, కార్యదర్శి పొంది భరత్ కళ్యాణ్, సభ్యులుగా లక్కమల్ల మోహన్ రావు, సంగం విద్యాసాగర్, నంది వెంకటేశ్వర్లు సమావేశం ఎన్నుకుంది.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కన్వీనర్ గంపల శివ కుమార్, జిల్లా కోకన్వీనర్ గోగుల మూడీ హరికృష్ణ, సీనియర్ నాయకులు కాల్వ సుందర్రావు,మైస క్రిస్టియన్ దాస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now