శ్రీ వినాయక ఊరేగింపులలో డి.జె. సౌండ్ సిస్టం నిషేధం
– వెంకటాపురం సి.ఐ. బి. కుమార్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధి పేరూరు, వెంకటా పురం, వాజేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో శ్రీ గణపతి నవరాత్రి మండపాల వద్ద, వినాయకుని నిమజ్జనాల ఊరేగింపులలో డి.జే. సౌండ్ సిస్టంను ఉత్సవ కమిటీలు వాడరాదని సి.ఐ. బి. కుమార్ కోరారు. అలాగే నిమజ్జన సమయాల్లో చెరువు లు, కుంటలు, గోదావరి నదులలో నీటి ప్రమాదాలు జరగకుం డా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీలు ఎవరైనా పోలీస్ శాఖ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని, నవరాత్రి ఉత్సవ కమిటీలు భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని, ఈ సంద ర్భంగా ఉత్సవ కమిటీలకు సీఐ బి. కుమార్ సూచించారు.