వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  శబరిష్

వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  శబరిష్

– రహదారులపై ఇసుక లారీలను నిలిపితే కేసులు నమోదు చేయండి

– గంజాయి రవాణా,గుడుంబా తయారీ ని పూర్తి స్తాయిలో అడ్డుకట్ట వేయాలి

 – మావోయిస్టుల కదలికలపై మరింతగా నిఘా పెంచాలి

 – ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి వారికీ కనీస సౌకర్యాలను కల్పించాలి

– జిల్లా ఎస్పి డా. శబరిష్ ఐపిఎస్

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వార్షిక తనిఖీల్లో భాగంగా వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి డా. శబరిష్ ఐ పి ఎస్ తనిఖీ చేసారు. స్టేషన్ రిసెప్షన్ లో గల రికార్డ్స్ ను పరిశీలించి కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్, ఆయుధ సామాగ్రిని ని సిబ్బంది యొక్క నైపుణ్యాన్ని తనిఖీ చేసారు. అనంతరం ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ  వెంకటాపురం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరి సర ప్రాంతాలు చతిస్గడ్ తో అంతర్రాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నందున గంజాయి రవాణా పై ఎక్కువగా దృష్టి సారించాల న్నారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నం దున ప్రజల భద్రత కై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం వారికి వెంటనే రసీదు అందించాలని ఎఫ్ ఐ ఆర్ నమోదు, కేసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ తెలియజేశారు. తదనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరనలో గల నమోదు కాబడని లేదా వదిలివేయబడిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగం అనేది భాద్యతతో కూడుకున్నదని క్రమశిక్షనతో ఉద్యోగం చేయాలని, విధులలో నిర్లక్ష్యం వాయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసు కుని వాటి పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐ వెంకటాపురం కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు, శిక్షణ (ప్రొబేషనరీ) ఎస్ఐ ఆంజనేయు లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment