పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రం లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లతో కలసి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం స్కీం కింద ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా కాన్సెంట్ తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గురించి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని, అదేవిధంగా ములుగు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని, ఎక్కడ చెత్త నిలువలు ఉండకుండా, మురుగు కాలువలు అపరిశుభ్రంగా ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ఎప్పటిక ప్పుడు బ్లీచింగ్ చల్లుతూ పరిశుభ్రత పాటించాలని, గ్రామస్తులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీల పరిధిలో సామాజిక ఇంకుడు గుంతలు తీయాలన్నారు. గ్రామ పంచాయతీలలో క్షేత్రస్థాయిలో అర్హులైన వితంతువులకు పెన్షన్ల గురించి నివేదిక సమర్పించాలని అన్నారు. గ్రామపంచాయతీల లో పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ ఉండాలని, జూన్ రెండవ తేదీన హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలను అధికంగా పెంచాలని, అదేవిధంగా పనులలో ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని అన్నారు. ఈ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న పనులను ఆయా సంబంధిత అధికారులు ఎల్లవేళలా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, కార్యద ర్శులు, బ్యాంకర్స్, ఆయా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Hi