ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రధాన ఆస్పత్రిని గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లోని టీ హబ్, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్, ఎన్.సి.డి సెంటర్, డైస్ బిల్డింగ్ ను పరిశీలించి తదుపరి వైద్యులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసే స్కాన్ మిషన్ కోసం ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి పరిశీలిం చారు. టీ హబ్ లో ఒక గదిని ఎన్.సి.డి సెంటర్ ఏర్పాటు చేసిన గదులను గుర్తించారు. టీ హబ్ లో రోగుల పట్టికను పరిశీలించి టీ హబ్ లో జరుగుతున్న పరీక్షల గురించి ఆరా తీశారు. డ్రగ్ స్టోర్ లో నిల్వ ఉన్న మందుల గురించి వివరాలు అడిగి రిజిస్టర్ ను పరిశీలించారు. జిల్లాలో ఆసుపత్రులకు వైద్య సేవలకు వచ్చే ప్రజలకు అనుగుణంగా సీజనల్ వ్యాధుల మందులు, యాంటీ బయోటిక్స్ ఇతర అత్యవసర వ్యాక్సిన్లను, మందులను అందు బాటులో ఉంచుకోవాలని సూచించారు. మందుల కొరత లేకుం డా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. పక్కనే ఉన్న డైస్ బిల్డింగ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అనువుగా ఉంటుందో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆసుపత్రిలో జరుగుతున్న సేవలు, సౌక ర్యాలు, సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. ఆసుపత్రిలో కావలసిన అవసరాలపై నివేదికలు అందించాలని ఆసుపత్రి పర్యవేక్షకుడిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్ట ర్ నవీన్ కుమార్, వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment