జిల్లా అంగన్వాడి నూతన సూపర్వైజర్ కార్యవర్గం
కాటారం, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (సూపర్వైజర్) జిల్లా యూనియన్ ను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి, స్టేట్ యూనియన్ సభ్యులు పద్మ భద్రమ్మ అధ్యక్షతన వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా వి సంధ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ జి.జయప్రద, వైస్ ప్రెసిడెంట్ వి అరుణ, సెక్రటరీ కే శివరాణి, జాయింట్ సెక్రటరీ పి లక్ష్మి, ట్రెజరరీ కే రజిత, కార్యవర్గసభ్యులుగా సరోజన, రమాదేవి, అరుణ, రజిత, నాగరాణి, అప్సర, సుజాత, వీణ, రమాదేవి లు ఎన్నికయ్యారు.స్ ఈ సమావేశంలో భూపాలపల్లి జిల్లా గ్రేడ్ వన్, గ్రేడ్ 2 ఈవోలు ( సూపర్వైజర్) లు పాల్గొన్నారు.