ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్
వెంకటాపురం వాజేడు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) పి.శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు పట్టిక, రికార్డ్స్ , స్టోర్ రూమ్ , ఆశ వర్కర్స్ డ్యూటీ చార్ట్ పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశ వర్కర్స్ తో అదనపు కలెక్టర్ మాట్లాడారు. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కార్డ్ ఎలా ఉపయోగించాలనే విషయంపై ఆశ కార్యకర్తలకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ మధుకర్ , సిబ్బంది పాల్గొన్నారు.
2 thoughts on “ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్”