హోప్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణి
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: హోప్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణి కార్యక్రమం చేపట్టగా ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ శబరిష్ హాజరై పంపిణీ చేశారు. ముందుగా గత 5 రోజులుగా పర్యావరణ పరిరక్షణ అవగాహన పై నిర్వహిస్తున్న హెచ్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం ములుగు జిల్లా పోలీస్, ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ తో ఛారిటీ మ్యాచ్ను ఏటూరునాగారం సీఐ, ఎస్ఐ పర్యవేక్షణలో జడ్పీ హెచ్ఎస్ స్కూల్లో నిర్వహించగా జిల్లా పోలీస్ టీమ్ విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు దనసరి సూర్య హోప్ సంస్థ కార్యక్రమాలకు తమ వంతుగా రూ. 20 వేలను విరాళంగా అందచేశారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువ త చెడు వ్యసనాల భారిన పడకుండా ఉండడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. హోప్ సంస్థ వారు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని, మరెన్నో కార్య క్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దనసరి సూర్య, జిల్లా పోలీస్ అధికారులు, హోప్ స్వచ్చంధ సంస్థ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.