ప్యాక్స్ ఆధ్వర్యంలో రైతులకు స్వీట్స్ పంపిణీ
మహాదేవపూర్,తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం లో గురువారం రుణ మాఫీ జరిగిన రైతులకు పాలకవర్గం రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్యాక్స్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతుల రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. సహకార సంఘంలో 172 మంది రైతులకు మొదటి విడత గా రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ జరిగిన రైతులకు వెంటనే తిరిగి రుణాలు మంజూరు చేస్తామని అన్నారు. రుణమాఫీ అయిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు రైతుల పక్షాన సహకార సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు తోట సుధాకర్, ఇబ్రహీం, దాసరి సమ్మయ్య, కృష్ణారావు, తిరుపతి రెడ్డి తో పాటు రుణమాఫీ అయిన రైతులు, కార్యాలయ సిబ్బంది తోపాటు పలువురు పాల్గొన్నారు.