విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:మండలంలోని గుర్రెవుల గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థిని, విద్యా ర్థులకు ఉపాద్యాయులు గురువారం క్రీడా దుస్టులను అంద జేశారు.ఇటీవల ఈపాఠశాలకు పదోన్నతిపై వచ్చిన ఉపాద్యా యులు, వంగ. పాపయ్య, కె. జెమున, వి.శ్యామ్ సుందర్, ఎన్.కవితలు డీఎస్సి ద్వారా నియామకం అయిన ఉపాద్యా యులు, ఆర్. రవీందర్, టి.రమేష్ లు తమ సొంత ఖర్చుల తో విద్యార్థులందరికి క్రీడా దుస్టులను బహుక రించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాద్యాయుడు వంగ పాప య్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖ రాలకు చేరాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం తమ పాఠశా లకు క్రీడా దుస్తులను బహుకరించినందుకు, ఉపాధ్యాయుని, ఉపాద్యాయులను అభినందించారు.