పెద్దగొల్లగూడెం గ్రామంలో యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ.
పెద్దగొల్లగూడెం గ్రామంలో యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం పెద్ద గొల్లగూడెం పంచాయతీ లో గ్రామ సర్పంచ్ జజ్జరి మేనక యువకులకు క్రీడా సామాగ్రి కిట్లు మంగళ వారం పంపిణీ చేశారు. గ్రామీణ యువత తమలో దాగి ఉన్న క్రీడా సామర్ధ్యాన్ని పెంపొందించుకొని, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రాణించే విధంగా క్రీడా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు గ్రామ సర్పంచి జజ్జరి మేనక తెలిపారు. ఈ సందర్భంగా మంజూ రైన వాలీబాల్, క్రికెట్, టీ షర్ట్స్, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇర్ప కోటేశ్వరరావు, యువకులు, క్రీడా కారులు, పాలకవర్గ సబ్యులు , పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.