వెంకటాపురం, వాజేడు మండలాలలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

వెంకటాపురం, వాజేడు మండలాలలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

వెంకటాపురం, వాజేడు మండలాలలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

– పేదలకు అండగ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. 

– భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు విస్తృతంగా పర్యటించి అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు మాట్లాడుతూ పేదలకు అండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేస్తామని తెలిపారు. మారుమూల గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని బృహత్ సంకల్పంతో విద్యా, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, వ్యవసాయం, ప్రాజెక్టు లు‌, గిరిజన సంక్షేమం, మహిళా సంక్షేమం తదితర అనేక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేయడమే ప్రభుత్వ లక్ష్య మన్నారు. అనంతరం వాజేడు మండలంలో 15 కుటుంబాల కు, వెంకటాపురం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాల యంలో ఏడుగురికి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎంపీడీవో విజయ, వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, వెంకటాపురం తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య, వాజేడు తహసిల్దార్,అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకు లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా వెంకటాపు రం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ఆధ్వర్యంలో వెంక టాపురం ఎస్సై కే.తిరుపతిరావు, వాజేడు ఎస్.ఐ రుద్ర హరీష్ ,సిఆర్పిఎఫ్, సివిల్ పోలీస్లు బందోబస్తు నిర్వహించారు.