హనుమాన్ స్వాములకు పండ్లు పంపిణీ
కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారంలో ఆంజనేయ మాల దరించిన దీక్షా స్వాములకు కాటారంలో ఆదివారం మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ మంచి నీళ్ళ బాటిల్స్, పండ్లు, అల్పాహారంనకు సరుకులను పంపిణీ చేశారు. మహారాష్ట్రలోని సిరొంచ గ్రామానికి చెందిన దీక్షా స్వాములంతా కాలినడకన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్తున్నారు. శ్రీరామ నవమి పర్వదినాన కాటారంలో దీక్షా స్వాములను మాజీ సర్పంచ్ నాయిని శ్రీనివాస్ సత్కరించారు. ప్రజలకు శ్రీరామ నవమి శుభకాంక్షలు తెలిపారు.