కళోత్సవంలో  రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు పంపిణీ

కళోత్సవంలో  రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు పంపిణీ

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు నాగారం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీ వల ములుగుజిల్లా కేంద్రంలో నిర్వహించిన కళోత్సవంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్రస్థాయి పోటీ లకు ఎంపికైన సందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలను మండల విద్యాశాఖాధికారి టి.వెంకటేశ్వరరావు, ప్రధానోపా ధ్యాయులు సోయం ఆనందరావు లు అందజేశారు. “అలెగ్జాం డర్ పురుషోత్తముడు” ఇంగ్లీష్ డ్రామాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన కె.మోహన్ తేజ, కె. రాహుల్, బి.రిషి, సి.హెచ్.మహేష్, ఆర్.లోకేష్ లకు మరియు “ఆది మానవుడు ప్రకృతి పరిరక్షకుడు”సోలో అంశంలో మూకాభి నయం చేసి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధిం చిన జి.కౌశిక్ లను  వాజేడు మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించి, రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోరిక స్వరూప్ సింగ్, చల్ల గురు గుల మల్లయ్య, రంగు ఆనంద్ పోరిక రవికుమార్, నూనావత్ శ్రీకాంత్, బొగ్గం కుమార్ బాబు, కంచు ప్రభాకర్, తెల్లం రాజ్య లక్ష్మి, షిండే రాజేష్, కోకిల శ్రీరంగం, జర్పుల వస్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment