పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధుల కట్టడి

పరిసరాల పరిశుభ్రత తోనే వ్యాధుల కట్టడి

– లక్ష్మీదేవి పేట స్పెషల్ ఆఫీసర్ అల్వాల రవీందర్, డాక్టర్ అనిత

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతను విధిగా పాటిస్తే వ్యాధుల కట్టడి సాధ్యమని లక్ష్మీదేవి పేట స్పెషల్ ఆఫీసర్ అల్వాల రవిందర్ ,డాక్టర్ అనిత పేర్కొన్నారు. గ్రామంలో పలుచోట్ల వైద్య శిబిరాలు నిర్వహించారు లక్ష్మీదేవి గ్రామంలోని గంగిరెద్దులగూడెంలో వైద్య శిబిరం నిర్వహించి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్ర మాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ సహకారంతో స్థానికులు అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా స్పెషల్ ఆఫీసర్ అల్వాల రవీందర్, డాక్టర్ అనిత మాట్లాడారు. పోషకాహారం తీసుకుంటేనే తల్లి బిడ్డలు ఆరో గ్యంగా ఉంటారన్నారు.అనంతరం ఇంటింటా జ్వరం సర్వే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పుష్పకుమారి, కరోబార్ గోస్కోల లక్ష్మణ్ బిపిఎం ధనుష్, ఏఎన్ఎం లు స్వర్ణ లత, వజ్ర, ఆశ కార్యకర్తలు రాజ్యలక్ష్మి, కవిత, జిపి సిబ్బంది రామకృష్ణ, తిరుపతి, రమ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.