కే వీ పీ ఏస్ డైరీ ఆవిష్కరణ.
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : కే వీ పీ ఏస్ రాష్ట్ర డైరీ ఆవిష్కరణ మహాదేవపూర్ ఎస్ ఐ కే ప్రసాద్ సోమవారం నాడు ఆవిష్కరించారు. అనంతరం కే వీ పీ ఏస్ మండల నాయకులు మాట్లాడుతూ కే వీ పీ ఏస్ డైరీ లో మహనీయులు మహాత్మ జ్యోతి రావు పూలె, చదువుల తల్లి సావిత్రి బాయి పూలె,డా,, బాబాసాహెబ్ అంబేద్కర్ లా జీవిత చరిత్రలు అలాగే ప్రజలకు ఉపయోగపడే విదంగా చట్టాలు, రిజర్వేషన్లు అనే విషయాలు ఈ డైరీ లో పొందుపరిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చేకూర్తి చెంద్రయ్య, కార్యదర్శి కుమ్మరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.