ములుగు సబ్ రిజిస్ట్రార్ గా దిలీప్ చంద్ర గోపాల్
ములుగు సబ్ రిజిస్ట్రార్ గా దిలీప్ చంద్ర గోపాల్
ములుగు ప్రతినిధి : ములుగు సబ్ రిజిస్ట్రార్ గా ఎం.దిలీప్ చంద్ర గోపాల్ నియామకమయ్యారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఐజి కార్యాలయ సూపరిండెంట్ గా పనిచేస్తున్న ఆయనను ములుగు సబ్ రిజిస్ట్రార్ గా బదిలీ చేశారు. ఇక్కడ ఇన్చార్జిగా పనిచేస్తున్న సృజన్ కుమార్ ను పరకాల సబ్ రిజిస్ట్రార్ గా ట్రాన్స్ఫర్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా రిజిస్ట్రేషన్లు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొత్త సబ్ రిజిస్ట్రార్ నియామకంతో ఊరట లభించనుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, మల్టీ జోనల్ పరిధిలోని సబ్ 56 మంది సబ్ రిజిస్ట్రార్ లను బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, ఐజి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఉత్తర్వులు వెలువరించారు.