ఆదివాసీల సమస్యలపై ఐటీడీఏ ముందు ధర్నా, రాస్తారోకో

Written by telangana jyothi

Published on:

ఆదివాసీల సమస్యలపై ఐటీడీఏ ముందు ధర్నా, రాస్తారోకో

– ఏజెన్సీ డిఎస్సి, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల జీవో ల రక్షణలో మంత్రి సీతక్క విఫలం

– ప్రభుత్వం స్పందించి జీవో లను కాపాడకుంటే ప్రభుత్వం పై పోరు తప్పదు

– తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా,మైపతి.అరుణ్ కుమార్, ఏ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి హెచ్చరిక

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలకేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఐటీడీఏ ముందు ఆదివాసీల సమస్యలపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ముందుగా ఆకులవారి ఘనపురం నుండి ర్యాలీగా బయలు దేరి  జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించగా జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించి పోయాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజ రైన తుడుందేబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా,మైపతి అరుణ్ కుమా ర్, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి లు మాట్లాడుతూ ఆదివాసీల పట్ల నాటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధానాలే నేటి కాంగ్రెస్ అవలంబిస్తున్నధి అని ఆవేదన వ్యక్తం చేసారు. 2023 ఎన్నికల సమయం లో స్వయానా మంత్రి సీతక్క తుడుందెబ్బ రాష్ట్ర కమిటీతో ముఖ్యమంత్రికి కలిపించి ఈ ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేస్తే ప్రభుత్వం ఏర్పడినాక ఏజెన్సీ డీఎస్సీ ఏర్పాటు, షెడ్యూల్డు ప్రాంత ఉద్యోగాల 29 శాఖల జీవో లను చట్టం చేయటం, ఆదివాసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం,ఐటీడీఏ లను బలోపేతం చేయటం, లంబాడీ ఆదివాసి సమస్య కు పరిష్కా రం చూపిస్తాం పోడు భూములకు పట్టాలు ఇస్తాం అని హామీ ఇచ్చారన్నారు.కానీ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయిన కానీ నేటికీ ఏజెన్సీ డి ఎస్సి ఏర్పాటు లేదన్నారు. జీవో 317 ద్వారా జనరల్ రూల్ అప్ రిజర్వేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయటం తో ఉద్యోగాలలో అన్యా యం జరుగుతుందన్నారు. 5 వ షెడ్యూల్ అమలులో ఉన్న ఏజెన్సీ సర్టిఫికెట్ ఇచే దిక్కు లేదన్నారు. ఉద్యోగులు ప్రమో షన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ట్రాన్సఫర్ లు ఐటీడీఏ లో జరగాలి, కానీ జనరల్ గా చేయటం తో ఆదివాసి ప్రాంతం లోకి మైదాన ప్రాంత ఉద్యోగులు వచ్చి ఆగం అవు తుందన్నారు. ఇన్ని జరిగిన ఆదివాసి మంత్రి గా ఉన్న సీతక్క కనీసం ఆదివాసీల బాధలు పట్టించుకునే పరిస్థితి లేదు అన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ట్రైబల్ అడ్వైసర్ కమిటీ కూడా ఇంకా ఏర్పాటు చేయక పోవడం దారుణ మన్నారు. వెంటనే మంత్రి సీతక్క ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చేయాలి అని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ప్రాజెక్ట్ అధికారికి అందిం చారు. ప్రాజెక్ట్ అధికారి కూడా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ప్రభుత్వంకి అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ ధర్నా కార్యక్రమం లో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నీ బెల్లి గణేష్, తుడుందెబ్బ రాష్ట్ర పోలిట్ బ్యూరో లో ఛైర్మెన్ పొడెం బాబు, ఉపాధ్యక్షులు పులిసే బాల కృష్ణ, జిల్లా అధ్యక్షులు కొరగట్ల లక్మన్ రావు, ఉపాధ్యక్షులు పోడెం నాగేస్, పాయం కోటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు పోడెం, శోభన్, విద్యార్థి రాష్ట్ర నేత కబ్బక లక్మన్, అలం.నగేష్, తాడ్వాయి మండల అధ్యక్షులు మొకాళ్ళ వెంకటేష్,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు వంక నరేష్, మంగపేట ఎట్టి సారయ్య,సుధాకర్ తొలెం, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా సందర్భంగా ఏటూరునాగారం సిఐ, వెంకటాపురం సిఐ, ఏస్ ఐ లు ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now