మేడారంలో వెంకటాపురం ఏజెన్సీ భక్తులు.
– వేలాదిగా తరలి వెళ్లిన అశేష భక్తజనం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మహా జాతర మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతం నుండి వేలాదిమంది భక్తులు మేడారం తరలివెల్లి అమ్మ వార్లకు మొక్కులు చెల్లించు కున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి, బంధువులతో,మిత్రులు తో అమ్మవార్ల గద్దెల వరకు, లక్షలాది భక్తుల జనసంద్రంలో వెళ్లి అమ్మ వార్లను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించు కున్నారు. ఈ సందర్భంగా మేడారం మహా జాతరకు ప్రభుత్వ జాతర నిర్వహణ కమిటీలు, ఉన్నత స్థాయి అధికారులు, అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది మేడారం సందర్శించే లక్షలాది మంది భక్తులు కు సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం రేఇఃబంవళ్ళు శేవాలు అందిస్తున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసేందుకు ఏర్పాటు చేయగా, అలాగే ప్రతి చోట న్నానాలు చేసేందుకు వీలుగా, వాటర్ పైపులను ఫౌంటెన్ విధానంతో ఏర్పాటు చేశారు. పైపుల ద్వారా ఒకేసారి 100 మంది భక్తులు వరకు స్నానాలు చేసే అవకాశం ఉంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారంతా పైప్ వాటర్ ఫౌంటెన్ వద్ద స్నానాలు చేసి దుస్తులు మార్చుకొని అమ్మవార్లకు మొక్కుబడులను చెల్లించుకుంటు న్నారు. అలాగే ఎప్పటికప్పుడు లౌడ్ స్పీకర్ ల ద్వారా భక్తులకు ప్రభుత్వ శాఖలు అమ్మ వార్ల దర్శనం సూచనలు, సలహాలు,తప్పిపోఇన వారి సమాచారం ,జేబు దొంగల జాగ్రత్తలు తెలుపుతున్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో, భారీ స్క్రీన్ పై అమ్మవార్ల దర్శనం భాగ్యం, ప్రత్యక్ష ప్రసారం తో అమ్మవార్లను దర్శించుకోలేని వారికి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా నేత్రపర్వంగా శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రత్యక్ష ప్రసారాలు టెలికాస్ట్ చేస్తుండడంతో, వేలాదిమంది భక్తులు భారీ తెరపై వీక్షించి జై సమ్మక్క తల్లి, జై జై సారలమ్మ తల్లి అంటూ భక్తి పారవశ్యంతో అమ్మవార్లకు జేజేలు పలికారు. కళ్ళకు కట్టి నట్లు ఛానల్ టెలికాస్ట్ చేయటంతో, వేలాదిమంది భక్తులు భారీ స్క్రీన్ పై అమ్మ వార్లను తిలకించి పునీతులమయ్యామని పలువురు వెంకటాపురం ఏజెన్సీ మేడారం భక్తులు తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని లక్షల, కోట్ల మంది భక్తులకు భక్తిపారవశ్యంతో,తిలకించే సౌకర్యం ఏర్పాటు చేయటంతో, ములుగు జిల్లా అదికార యంత్రాంగం , రాష్ట్ర ప్రభుత్వం , గౌరవ మంత్రివర్యులు సీతక్క రేయింబవళ్ళు ,జిల్లా ప్రబుత్వ యంత్రాంగంతో విశేష కృషితో మేడారం లక్షలాది భక్త జనులు ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్మ వార్లును దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకొని చలో మేడారం, చలో స్వగ్రామం అంటూ, జై సమ్మక్క తల్లి, జై జై సార్లమ్మ తల్లి నామస్మరణ లతో, అమ్మవార్ల బంగారాన్ని పట్టుకొని గ్రామాలకు, గ్రామాల భక్తజనం స్వగ్రామాలకు బయలుదేరి వస్తున్నా రు. మేడారం మహా జాతర సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంలోని వాజేడు, భద్రాచలం నియోజకవర్గం లోని,చర్ల ,దుమ్ముగూడెం ,వెంకటాపురం ,వాజేడు మండలాల నుండి వందలాది గ్రామాలు ప్రజలు, ఆదివాసీలు అశేష భక్తజనం మేడారం చేరుకోవడంతో గ్రామాలన్నీ నిర్మానుష్మం యయ్యాయి. టీఎస్ఆర్టీసీ భద్రాచలం నియోజకవర్గం లోని భద్రాచలం, చర్ల, వెంకటాపురం, మరియు ములుగు జిల్లా ఎటు రు నాగారం ప్రాంతాల నుండి మేడారం వెళ్లే భక్తులకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. అమ్మవార్ల దర్శనం చేసుకున్న వెంటనే స్పెషల్ బస్సులలో వారి, వారి గ్రామాలకు మేడారం భక్తులు చేరుకుంటున్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో, వేలాదిమంది మహిళా సోదరీ మణులు, వారి బిడ్డలు, అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములు కుటుంబాలు యావత్తు జై సమ్మక్క తల్లి జై జై సమ్మక్క తల్లి అంటూ మేడారం మహా జాతరకు తరలి వెళ్లారు. శుక్రవారం మేడారం కీలక నిండు జాతర , మహా జాతర సందర్భంగా ఖాళీ అయిన గ్రామాలు తిరిగి గ్రామస్తులు తమ స్వగ్రామా లకు చేరుకుంటున్నారు. రైతాంగం పాడి పంటల సౌందర్యం తో, యధా విధిగా కొనసాగాలని, సకల జనులు సుఖ శాంతు లతో ఉండాలని, పాడి పంటలు సక్రమంగా పండి పచ్చదనం తో పల్లెలు అన్ని శ్రీ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఉండాలని, శ్రీ మేడారం భక్తులు అమ్మవార్లకు మొక్కుబడు లతో వేడుకున్నట్లు తెలిపారు.