వాజేడు పీహెచ్సీ ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్వో
తెలంగాణ జ్యోతి, వాజేడు : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏటూరునాగారం ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్వో క్రాంతి కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఐటీడీఏ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు డెలివరీ కేసులను సందర్శించి తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి తెలుసుకొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు గురించి వ్యాధుల గురించి తెలుసు కొని వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. మొదటి విడత దోమల మందు పిచికారి మురుమూరు కాలనీ గ్రామాలలో ఏటూరు నాగారం ఐటీడీఏ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ. కోరం క్రాంతి కుమార్ పర్యవేక్షించి వర్షాకాలపు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడకుండా ప్రతి గ్రామాలలో దోమల మందు పిచికారి చేయించి ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని, దోమలు దరి చేరకుండా శుభ్రతను పాటించాలని గ్రామస్తుల కు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో వాజేడు వైద్య అధికారి కొమరం మహేంద్ర మధుకర్, సబ్ యూనిట్ అధికారి వాసం నరసింహారావు, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.